డాల్లస్/ఫోర్టువర్త్,టెక్సస్: తెలుగుసాహిత్యసేవలలో నిర్విరామంగా ఉత్తరటెక్సస్తెలుగుసంఘం (టాంటెక్స్) వారు నిర్వహించేనెలనెలాతెలుగువెన్నెల” 94 కార్యక్రమంనెల ఆదివారంమే 17, దేశిప్లాజా స్టూడియో, డాలస్లోసాహిత్యవేదికసమన్వయకర్తదండవెంకట్గారిఅధ్యక్షతనఎంతోఘనంగాజరిగింది. "కనుమరుగవుతున్నవాత్సల్యరసాస్వాదన" ఇతివృత్తంగాడా. పుట్టపర్తినాగపద్మినిగారుచేసినప్రసంగంమనసుమడతల్లోఎక్కడోదాగినమమకారపుమల్లెలనుచిగురించేలాచేసింది. కార్యక్రమంఒకవినూత్నమైనఅంశంతోప్రారంభమైనది. అమెరికాలోపుట్టిపెరిగినపిల్లలుపాశ్చాత్యపద్ధతిలోవాయిద్యసంగీతంనేర్చుకుంటారుకాబట్టి, వారిధోరణిలోనే, వారినోట్స్తోనేమనశాస్త్రీయవాయిద్యపరికారాలుపలికిస్తేఎలాఉంటుందిఅన్నఆలోచనతోడా.

కలవగుంటసుధగారిఆధ్వర్యంలోప్రార్ధనాగీతాన్నిచిన్నారులుమాతంగిసాయికౌశిక, కలవగుంటనర్తన, కస్తూరిప్రణవ్, ప్రభలఆరతి, కలవగుంటకీర్తన, మరియువడ్డూరిసిద్ధార్ధమోహనరాగంరూపకతాళంలోఎంతోచక్కగాప్రదర్శించారు. చి॥చెరుకూరిబృహతి "భగవంతునికీర్తన - కవిభావం" అనేఅంశంమీదత్యాగరాజు, అన్నమయ్య, రామదాసుఅంతరంగఆవిష్కరణచక్కగాచేసింది. చి॥కొణిదెనసాత్విక్, శ్రీశ్రీగారిగురించితెలుగులోఅనర్గళంగామాట్లాడి, ఆయనమహాప్రస్థానంనుండికొన్నికవితలుచాలాబాగాచదివివినిపించారు. “మాసానికోమహనీయుడుఅంశంలోవరిగొండశ్యాం, విశ్వకవిరవీంద్రనాథ్ఠాగూర్గురించిమాట్లాడుతూఆయనమనజాతీయగీతం "జనగణమణ" మాత్రమేకాకుండాబంగ్లాదేశ్, శ్రీలంకదేశాలజాతీయగీతాలనుకూడారచించారని, ఆసియాఖండంలోసాహిత్యంలోనోబెల్బహుమతిపొందినమొదటివ్యక్తిఅనిప్రస్తుతించారు. చి॥కర్రియశస్వ్జయజయజయప్రియభారతజనయిత్రిరమ్యంగాఆలపించి, దేవులపల్లికృష్ణశాస్త్రిగారినిగుర్తుచేసారు. శ్రీమతిఅట్లూరిస్వర్ణగారి "సరదాగాకాసేపు" క్విజ్ఆద్యంతంనవ్వులుపూయించింది. బాదరాయణసంభంధంఅంటేఏదోఒకవంకతోచుట్టరికంకలుపుకోవడంఅని, దారినపోతున్నఒకవ్యక్తినాబండిచక్రంబదరీ (రేగు) తోచేసింది, మీఇంట్లోకూడారేగుచెట్టుఉందిఅనిసంబంధంకలుపుకొనిచక్కగాభోజనంచేసివెళ్ళాడనిహాస్యపూరకంగావర్ణించారు.డా. MDN రావుగారుస్వీయకవితచదివివినిపించగా, శ్రీమతిమల్లాదిపద్మజచక్కనికథానికతోఅలరించారు.

nntv-1-650.jpg

 

ముఖ్య అతిధి డా. పుట్టపర్తి నాగపద్మిని గారు తొలుత తమ తండ్రిగారు 'సరస్వతీపుత్రస్వర్గీయ పుట్టపర్తి నారాయణచార్యులు గారు రచించిన "శివతాండవం" కావ్యం నుండి చక్కని పద్యాలను వినిపించారు. ప్రధాన ప్రసంగం చేస్తూ, కాలం ఇట్టే గడచి పోతుంది, పిల్లలు లేత పెదవులతో వచ్చీ రాని మాటలతో మాట్లాడే ముద్దు ముద్దు మాటలు తనివితీరా ఆస్వాదించాలి, కాలం వెనక్కు రాదు, ఆ వాత్సల్యం-ప్రేమలో తడుస్తూ, ఈ అపురూపమైన మానవ జన్మను చరితార్ధం చేసుకోవాలి అని చెప్పారు. కృష్ణ పరమాత్మను ఆవిష్కరించే పాటల్లో వాత్సల్యం పొంగిపొరలుతుంది, త్యాగరాజు అన్నమయ్య పాటలలో విశిష్ఠత ఎంతో చక్కగా వివరించారు. శాతవాహన చక్రవర్తి హాలుడు  రచించిన “గాథా సప్తశతి” నుండి కొన్ని ఘట్టాలు వివరిస్తూ ఒకసారి వచ్చిన వరదలకు చెట్లు గూళ్ళు కొట్టుకు పోతున్నా, అప్పుడు ఒక కాకి ఆ వరదకు ఎదురు ఈదుతూ తన పిల్లలను రక్షించే విధానం, కడు రమ్యంగా వివరించారు. 15 వ శతాబ్దానికి చెందిన అంధుడైన సూరదాసు అనన్య సామాన్య రీతిలో కృష్ణ లీలలు వర్ణించిన విధానం, కృష్ణునిలో రాముని దర్శించిన విధానం, ఆకట్టుకొనేలా వివరించారు. మన జానపదులు గొప్ప సంప్రదాయం అని, తెలుగు సాహిత్యంలో రకరకాలైన పాటలు ఉన్నాయని, ప్రజలకు అత్యంత సులభంగా చేరువయ్యేవి జానపదాలు అని కొనియాడారు. ఋగ్వేదం ఉన్న ధ్వని, లయ, శృతి లాలిపాటలలో ఉన్నాయని ప్రస్తుతించారు. లాలిపాటలలో జీవస్వరాలు ఉన్నాయని, వాటిని పదే పదే పలకడం వలన జీర్ణ శక్తి పెరుగుతుంది వివరించారు.

ఈకార్యక్రమందేశీప్లాజా టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కావడంతో అమెరికా నలుమూలల నుండి ఎంతో మంది వీక్షించారు. అధ్యక్షులుడా. ఊరిమిండినరసింహారెడ్డిమాట్లాడుతూప్రతినెలాకొత్తవారుకూడాసాహిత్యఅభిలాషతోకార్యక్రమానికిరావడం, ముఖ్యంగాబాలబాలికలుఉత్సాహంతోపాల్గొనడంఎంతోఅభినందనీయంఅన్నారు. పిల్లలనుప్రొత్సహిస్తున్నతల్లిదండ్రులకుకృతఙ్ఞతలుచెప్పారు. డాల్లస్సంగీత, సాహిత్య, సంస్కృతిసంప్రదాయాలకుకేంద్రబిందువుఅని, సంస్థఎఫ్ఫుడూతోడ్పాటుఅందిస్తుందనిచెప్పారుప్రతిసంవత్సరంజరుపుకునే "తెలుగుసాహిత్యవేదికవార్షికోత్సవం" జులై 12 న అని, నెలనెలాతెలుగువెన్నెలవందవమైలురాయి  చేరుతున్నసందర్భంలోశతసదస్సు "100నెలనెలాతెలుగువెన్నెల" నవంబర్ 14 ఘనంగాజరుపడానికిసన్నాహాలుమొదలుపెట్టారని, అందరూవిచ్చేసి, పాల్గోని, జయప్రదంచేయమనికోరారు.

ఉత్తరటెక్సస్తెలుగుసంఘం (టాంటెక్స్) అధ్యక్షులుడా. ఊరిమిండినరసింహారెడ్డి, ఉత్తరాధ్యక్షులు జొన్నలగడ్డసుబ్రహ్మణ్యం, సమన్వయకర్తదండవెంకట్, సాహిత్యవేదికబృందం, టాంటెక్స్ కార్యవర్గం ముఖ్యఅతిధి డా. పుట్టపర్తినాగపద్మినిగారినిశాలువ మరియు జ్ఞాపికతోసత్కరించారు. సమన్వయకర్తదండవెంకట్మాట్లాడుతూతెలుగుభాషాభిమానులకు, సాహితీప్రియులకుకృతజ్ఞతలుతెలిపారు. ప్రత్యేకప్రసారమాధ్యమాలైనదేశీప్లాజా, రేడియోఖుషిమరియుప్రసారమాధ్యమాలైనటీవీ9, టీవీ5, సీవీఆర్టీవీ, 6టీవీలకుకృతఙ్ఞతాపూర్వకఅభివందనములుతెలియజేసారు. టాంటెక్స్ కార్యవర్గసభ్యులు, కాకర్లవిజయమోహన్, వీర్నపుచినసత్యం, శీలం కృష్ణవేణి, సింగిరెడ్డిశారదకార్యక్రమంలోపాల్గొన్నారు.

Upcoming Events

LMA presents Light Music Training Camp
05-29-2015 12:00 am
Category:  All Other
Ekal Vidyalaya- 100 Years Of Bollywood
05-30-2015 7:00 pm
Category:  Concerts
Sri Karya Siddhi Hanuman Maha Kumbabhisheka
07-18-2015 12:00 am
Category:  Concerts | Religious
3rd NATA Convention
05-27-2016 12:00 am
Category:  Concerts | All Other